వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్‌

Mon,October 7, 2019 03:55 PM

స్టాక్‌హోమ్(స్వీడన్): వైద్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే నోబెల్ పురస్కారం ఈ ఏడాది ముగ్గురు వైద్యులను వరించింది. 2019 ఏడాదికి గాను విలియం జీ.కెలిన్ జూనియర్, సర్ పీటర్ జే.రాట్‌క్లిఫ్, గ్రెగ్ ఎల్.సిమెంజాలను ఉమ్మడిగా ఈ అవార్డుకు నోబెల్ జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. ఆక్సిజన్‌ను కణాలు ఎలా అందిపుచ్చుకుంటాయనే దానిపై ఈ ముగ్గురు పరిశోధన చేశారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో పురస్కారాన్ని అందజేస్తారు.

1427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles