మయన్మార్ మహిళపై సెలూన్ మేనేజర్ వేధింపులు

Mon,February 11, 2019 03:57 PM

3 years jail term beauty salon manager in singapore

సింగపూర్ : హెయిర్ సెలూన్ లో పనిచేస్తున్న మహిళపై వేధింపులకు పాల్పడిన సెలూన్ మేనేజర్ ను సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సింగపూర్ లోని ఓ బ్యూటీ పార్లర్ మేనేజర్ లిండా సీ (39) తన పార్లర్ లో పనిచేస్తున్న మయన్మార్ కు చెందిన మహిళ ఫ్యూ మర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. లిండా సీ ఆ మహిళపై వేడి నీరు పోయడంతో..ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వేడి నీటి వల్ల ఆ మహిళ తల వెంట్రుకలు కూడా ఊడిపోయాయి. లిండా సీ అంతటితో ఆగకుండా ఫ్లోర్ ను శుభ్రం చేసే నీటిని తాగాలని ఆ మహిళని ఇబ్బంది పెట్టాడు. మొబైల్ ఫోన్ తో ఆమె తలపై పదేపదే కొట్టాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లిండా సీని అదుపులోకి తీసుకున్నారు. మహిళపై పైశాచికంగా ప్రవర్తించిన మేనేజర్ లిండా సీను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ఒలివియా లొ మేనేజర్ లిండా కు మూడేళ్ల జైలు శిక్షతోపాటు 6,630 యూఎస్ డాలర్లు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

1154
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles