34 మంది భారత జాలర్లు అరెస్ట్‌

Wed,May 8, 2019 12:30 PM

34 Indian fishermen arrested for straying into Pakistan waters

కరాచీ : పాకిస్థాన్‌ తీరగస్తీ దళం 34 మంది భారత జాలర్లను అరెస్టు చేసింది. పాక్‌ భూభాగంలోని జలాల్లోకి భారత జాలర్లు ప్రవేశించినందుకు వారిని అరెస్టు చేశామని పాక్‌ అధికారులు వెల్లడించారు. ఆరు బోట్లను కూడా సీజ్‌ చేశామని తెలిపారు. స్థానిక పోలీసులకు భారత జాలర్లను అప్పగించామని, జ్యుడిషీయల్‌ రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు భారత జాలర్లను అరెస్టు చేయడం ఇది రెండోసారి. జనవరిలో ఐదుగురు జాలర్లను(గుజరాత్‌) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక గత నెలలో 250 మందికి పైగా భారత జాలర్లను పాకిస్థాన్‌ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. పాక్‌ జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న 360 మంది భారత జాలర్లను విడుతల వారీగా విడుదల చేస్తామని పాక్థిన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం విదితమే.

1510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles