ట్రక్కు కంటెయినర్‌లో 39 మృతదేహాలు..

Wed,October 23, 2019 02:42 PM

లండన్: లండన్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ ట్రక్కు కంటెయినర్‌లో 39 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. పశ్చిమలండన్ గ్రేస్‌లోని పారిశ్రామిక పార్కులో ఈ మృతదేహాలు గుర్తించినట్లు ఎస్సెక్స్ పోలీస్ అధికారి ఆండ్రూ మారినర్ తెలిపారు. ట్రక్కు బల్గేరియా నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది.


చనిపోయినవారిలో ఒకరు యువకుడు కాగా..మిగతావాళ్లంతా పెద్దవాళ్లు. ఉత్తర ఐర్లాండ్ కు చెందిన 25 ఏళ్ల లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారి ఆండ్రూ మారినర్ తెలిపారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

6046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles