పాక్‌లో జరిగిన అత్యంత ఘోర రైలు ప్రమాదలివే..

Thu,October 31, 2019 03:24 PM

కరాచీ : పాకిస్థాన్‌లో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తేజ్‌గమ్‌ రైలులో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతూనే ఉంది. పేలుడు సంభవించిన మూడు బోగీల్లో సుమారు 200 మంది ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పాకిస్థాన్‌లో 2018 సెప్టెంబర్‌ నుంచి ఇప్పటి వరకు ఏడు అత్యంత ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి.


సెప్టెంబర్‌ 16, 2018 : కరాచీ నుంచి పెషావర్‌ వెళ్తున్న కుషాల్‌ ఖాన్‌ ఖట్టక్‌ ఎక్స్‌ప్రెస్‌.. అట్టోక్‌ వద్ద పట్టాలు తప్పింది. తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సెప్టెంబర్‌ 27, 2018: సింధ్‌ నుంచి పెషావర్‌ వెళ్తున్న ఓ ఎక్స్‌ప్రెస్‌ షేవాన్‌ వద్ద పట్టాలు తప్పడంతో 11 బోగీలు బోల్తా పడ్డాయి.
డిసెంబర్‌ 18, 2018 : పంజాబ్‌లోని నారోవల్‌ వద్ద స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న వ్యాన్‌ను ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం మంచు కారణంగానే జరిగిందని నాడు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.
జూన్‌ 9, 2019 : సుక్కూర్‌ వద్ద కరాచీ వెళ్తున్న ఓ గూడ్స్‌ రైలు అదుపుతప్పింది. దీంతో 23 బోగీలు పట్టాలు తప్పాయి.
జూన్‌ 20, 2019 : మక్లీ షా వద్ద ప్యాసింజర్‌ రైలు.. కార్గో రైలును ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు.
జులై 11, 2019 : పంజాబ్‌లోని సాదిక్‌బాద్‌ వద్ద కార్గో రైలు.. క్వెట్టా వెళ్తున్న రైలును ఢీకొట్టింది. దీంతో 24 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
అక్టోబర్‌ 31, 2019 : తేజ్‌గమ్‌ రైలులో సిలిండర్‌ పేలడంతో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

1539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles