అతిగా తినడానికి కారణం ఇదే...

Sat,August 25, 2018 07:12 AM

A High Fat Diet Leads to Overeating Because of Faulty Brain Signaling

లాస్ ఏంజెల్స్: మెదడు పనితీరు దెబ్బతింటే అది అతిగా తినడానికి దారితీస్తుందని, తద్వారా ఊబకాయం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మెదడు పనితీరు పాడైతే కడుపు నిండిందని సంకేతాలను పంపే న్యూరాన్ల పనితీరు మందగించి సంకేతాలు సరిగా వెలువడవు. దీంతో ఎంత తింటున్నామనే దానిపై నియంత్రణ కోల్పోయి.. ఊబకాయం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ మేరకు శాస్తవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరుపుతూ వాటికి అధిక కొవ్వుగల ఆహారాన్ని అందించి, వాటిలో సంభవించిన మార్పులను పరిశీలించారు.

దీని ప్రకారం.. అధిక కొవ్వు కలిగిన ఆహారం ఎంఎంపీ-2 అనే ఎంజైమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజైమ్ మెదడులోని హైపోథాలమస్ న్యూరానల్ కణాల ఉపరితలంపై ఉన్న గ్రాహకాలను లెప్టిన్ హార్మోన్‌తో కలువకుండా నిరోధిస్తుంది. లెప్టిన్ హార్మోన్ దాని గ్రాహకాలతో సంలీనం చెందకుండా ఎంఎంపీ-2 ఎంజైమ్ నిరోధిస్తుంది. ఇది కడుపు నిండిందనే సంకేతాలను పంపకుండా న్యూరాన్లను అడ్డుకుంటుంది. ఎంఎంపీ-2 ఎంజైమ్‌ను గనుక అడ్డుకోగలిగితే లెప్టిన్ హార్మోన్ గ్రాహకాలతో కలిసిపోయి తృప్తికి సంబంధించిన సంకేతాలు వెలువడుతున్నాయని పరిశోధకులు నిరూపించారు. మెదడులో డిస్ట్రక్టివ్ మాలిక్యులార్ మెకానిజానికి సంబంధించి పరిశీలనలు, విశ్లేషణలు వెలువడంటం ఇదే మొదటిసారని పరిశోధకులు తెలిపారు.

3631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles