దుండగుడి కాల్పుల్లో జర్నలిస్ట్ మృతి

Sat,May 11, 2019 04:58 PM

కాబూల్: గుర్తుతెలియని వ్యక్తి జరిపిన తుపాకి కాల్పుల్లో ఓ మహిళా జర్నలిస్ట్ మృతిచెందింది. ఈ విషాద సంఘటన అఫ్గానిస్తాన్‌లో చోటుచేసుకుంది. ఆఫ్గానీ జర్నలిస్ట్, పార్లమెంట్ సాంస్కృతిక సలహాదారు మీనా మంగల్ స్థానిక చానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తుంది. ఈమెపై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆఫ్గాన్‌లో చోటుచేసుకున్న బాంబు దాడుల్లో 15 మంది జర్నలిస్ట్‌లు మృతిచెందారు. ఒకే రోజు తొమ్మిది మంది మృతిచెందారు.

655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles