3 కెమెరాల‌తో.. ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌

Wed,September 11, 2019 10:08 AM

Apple introduces Pro models in its iphone category

హైద‌రాబాద్‌: యాపిల్ సంస్థ త‌న కొత్త ఐఫోన్ల‌ను రిలీజ్ చేసింది. కాలిఫోర్నియాలోని క్యుప‌ర్టినోలో జ‌రిగిన ఈవెంట్‌లో టిమ్‌కుక్ ఐఫోన్‌11 మోడ‌ళ్ల‌ను రిలీజ్ చేశారు. ఒక‌వైపు ఐఫోన్ అమ్మ‌కాలు త‌గ్గుతున్నా.. మ‌రో వైపు యాపిల్ మాత్రం స్మార్ట్‌ఫోన్ కొత్త డిజైన్ల‌ను విడుద‌ల చేసింది. ఈ ఏడాది రెండు కొత్త హైఎండ్ ఐఫోన్ల‌ను రిలీజ్ చేశారు. ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్ మోడ‌ళ్ల‌ను యాపిల్ రిలీజ్ చేసింది. ఇక త‌క్కువ ధ‌ర క్యాట‌గిరీలో ఐఫోన్‌11ను రిలీజ్ చేశారు. నాలుగు ర‌కాల ప్రైస్ ట్యాగ్స్‌తో వీటిని ప్ర‌జెంట్ చేశారు. బ్యాట‌రీ లైఫ్, కెమెరా సిస్ట‌మ్‌, హార్డ్‌వేర్‌ల‌ను మ‌రింత ప‌క‌డ్బ‌దీంగా త‌యారు చేస్తూ యాపిల్ త‌న మోడ‌ళ్ల‌ను రిలీజ్ చేసింది. ఎంట్రీ లెవ‌ల్ ఐఫోన్ 11 కేవ‌లం 700 డాల‌ర్ల‌కు అమ్మ‌నున్నారు. అడ్వాన్స్‌డ్ మోడ‌ళ్లు అయిన ఐఫోన్ 11 ప్రో వెయ్యి డాల‌ర్ల‌కు, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌ను 1100 డాల‌ర్ల‌కు అమ్మ‌నున్నారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న క్యాంప‌స్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఈ కొత్త ఫోన్ల‌ను రిలీజ్ చేశారు. ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ మోడ‌ళ్ల‌కు మరింత అద‌న‌పు ఫీచ‌ర్ల‌ను క‌లిపారు. ఈ ఫోన్ల‌లో కెమెరా సిస్ట‌మ్‌ను ఆధునీక‌రించారు. ప్రో, ప్రో మ్యాక్స్ ఫోన్ల‌కు మూడు(రియ‌ర్‌) కెమెరాల‌ను ఇచ్చారు. పాత మోడ‌ళ్ల క‌న్నా.. బ్యాట‌రీ లైఫ్‌ను పెంచారు. ఐఫోన్ ఎక్స్ఎస్‌ క‌న్నా.. 11 ప్రో నాలుగు గంట‌ల ఎక్కువ బ్యాట‌రీ లైఫ్ ఇవ్వ‌నున్న‌ది. ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ క‌న్నా.. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ బ్యాట‌రీ లైఫ్ అయిదు గంట‌లు ఎక్కువ‌గా ఉంటుంది. యాపిల్ వాచ్‌ల‌లో కొత్త వ‌ర్షెన్లు, కొత్త ఐప్యాడ్‌ల‌ను కూడా రిలీజ్ చేశారు.

532
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles