సైనికుడిని చంపిన ఆర్మీ కుక్కలు

Fri,November 15, 2019 11:10 AM

హైదరాబాద్‌ : ఆస్ర్టియన్ ఆర్మీలో విషాదం నెలకొంది. రెండు ఆర్మీ కుక్కలు కలిసి ఓ సైనికుడిని చంపేశాయి. కుక్కల దాడిలో మృతి చెందిన సైనికుడు 2017 నుంచి ఆర్మీ కుక్కల సంరక్షణను చూస్తున్నాడు. అయితే గురువారం కుక్కలు ఉన్న బ్యారక్‌లో వెళ్లి వాటికి ఆహారం ఇస్తున్నాడు. ఈ క్రమంలో రెండు కుక్కలు సైనికుడిపై దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఒక కుక్క వయసు ఆరు నెలలు మాత్రమే. ఈ ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సైనికుడి మృతిపై ఆస్ర్టియా ప్రెసిడెంట్‌ అలెగ్జాండర్‌ వ్యాన్‌ సంతాపం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్ర్టియా ఆర్మీలో మొత్తం 170 శునకాలు ఉన్నాయి.

2074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles