హృదయాలను గెలిచిన పీఎం మోదీ శ్రద్ధ

Sun,September 22, 2019 10:30 AM

హైదరాబాద్‌: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా హూస్టన్‌ పట్టణానికి చేరుకున్న విషయం తెలిసిందే. హౌడీ, మోదీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీఎం హూస్టన్‌ చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో అమెరికా, భారత అధికారులు పీఎంకు ఘన స్వాగతం పలికారు. ట్రేడ్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ ఓల్సన్‌, యూఎస్‌ రాయబారి కెన్నత్‌ జెస్టర్‌, భారత రాయబారి హర్షవర్ధన్‌, ప్రవాస భారతీయులు మోదీకి హృదయపూర్వక ఆహ్వానం పలికారు. కాగా ఈ ఆహ్వాన కార్యక్రమంలో ప్రధాని చేసిన చిన్న చర్య అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్‌ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. విమానం నుంచి అభివాదం చేస్తూ బయటకు నడుచుకుంటూ వచ్చిన మోదీ అక్కడి అధికారులను పరిచయం చేసుకుంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. కాగా ఓ వ్యక్తి అందించిన పూలబొకేలోని పుష్పాలు కార్పెట్‌పై పడ్డాయి. వెంటనే ప్రధాని స్పందించి వాటిని తీసి తన భద్రతా సిబ్బందికి అందించారు. ప్రధాని చర్యను మెచ్చుకుంటూ సోషల్‌ మీడియా వినియోగదారులు విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు.

2985
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles