అమ్మ ప్రేమ అంటే ఇదే.. తప్పక చూడాల్సిన వీడియో

Sat,July 13, 2019 07:02 PM

అమ్మ ప్రేమకు వెలకట్టలేం. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు చాలా విలువ. అమ్మ అమ్మే. మనుషులైనా.. జంతువులైనా.. పక్షులైనా.. ఎవరైనా.. తన పిల్లల కోసం అమ్మ పడే ఆరాటమే వేరు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అమ్మ ప్రేమకు నిలువెత్తు నిద‌ర్శ‌నం.


ఓ పక్షి తను పెట్టిన గుడ్లను ఓ చోట పొదుగుతుంది. అయితే.. అక్కడి నేలను దున్నేందుకు ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో వస్తుండగా.. ఈ విషయాన్ని గమనించిన ఆ పక్షి.. తన గుడ్లకు ఏమవుతుందోనని... రెక్కలాడిస్తూ ట్రాక్టర్ ముందుకు వెళ్లి అడ్డ‌గించింది. దీంతో వెంటనే ట్రాక్టర్‌ను ఆపి.. ఆ పక్షి పొదిగిన గుడ్లను గమనించి.. అక్కడి నుంచి వేరే మార్గంలో ట్రాక్టర్ పోనిస్తాడు ఆ వ్యక్తి. అంతే కాదు.. ఆ పక్షి తల్లి ప్రేమను అర్థం చేసుకున్న అతడు.. దాని కోసం ఓ బాటిల్‌లో నీళ్లను కూడా పెడతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన చైనాలోని ఉలాన్‌క్వాబ్ సిటీలో చోటు చేసుకున్నది.

7002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles