శ్రీలంకలో మరో పేలుడు

Thu,April 25, 2019 12:04 PM

Blast in Sri Lankan town Pugoda, no casualties

కొలంబో : శ్రీలంకలో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. కొలంబోకు 40 కిలోమీటర్ల దూరంలోని పుగోడాలో ఇవాళ ఉదయం బాంబు పేలుడు జరిగింది. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మెజిస్ట్రేట్‌ కోర్టుకు వెనుకాల ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 21న ఈస్టర్‌ పర్వదినం సందర్భంగా శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల దాడిలో 359 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 500 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులందరూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పేలుళ్ల నేపథ్యంలో 58 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

1525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles