ఈ షూ మీకు ఏ కలర్‌లో కనిపిస్తోంది.. వైరల్ ఫోటో..!

Sat,May 11, 2019 06:57 PM

Can you find colour of this Optical Illusion Shoe

ఆప్టికల్ ఇల్యూజన్ అంటే తెలుసా మీకు? ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా చూపించడమే ఆప్టికల్ ఇల్యూజన్ టెక్నిక్. దాన్నే మనం తెలుగులో భ్రాంతి అని అంటాం. ఆప్టికల్ ఇల్యూజన్ మీద ఇప్పటికే చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక త్రీడీ ఫోటోను చూపించి... మధ్యలో ఓ చుక్క పెట్టి.. దాన్నే చూస్తూ ఉండండి.. తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి... అంటూ సోషల్ మీడియాలో షేర్ అయ్యే ఎన్నో ఫోటోలను మనం రోజూ చూస్తూనే ఉంటాం.

తాజాగా సోషల్ మీడియాలో ఓ షూ వైరల్‌గా మారింది. ఏంటి.. ఆ షూ స్పెషాలిటీ అంటారా? అది ఆప్టికల్ ఇల్యూజన్ షూ. అంటే కొందరికి ఆ షూ ఒక కలర్‌లో కనిపిస్తే.. మరికొందరికి మరో కలర్‌లో కనిపిస్తుందట. మీరు పైన చూస్తున్నారు కదా షూ.. ఆ షూ గురించే మనం మాట్లాడుకునేది ఇప్పుడు.

ఆ షూను థాట్స్ ఫర్ లైఫ్ అనే ఫేస్‌బుక్ పేజీలో గత వారం పోస్ట్ చేశారు. చాలామందికి ఆ ఫోటో బూడిర రంగు, లేత ఆకుపచ్చ రంగులో కనిపిస్తుందట. మరికొందరికి మాత్రం పింక్, వైట్ కలర్‌లో కనిపిస్తుందట ఆ షూ. అయితే.. కొందరికి ఒక రంగులో.. మరికొందరికి మరో రంగులో కనిపించడానికి కారణాన్ని కూడా వివరించారు.

మనిషి మెదడులో రెండు భాగాలు ఉంటాయి తెలుసు కదా. ఒకటి రైట్ బ్రెయిన్.. రెండోది లెఫ్ట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ డామినేట్ చేసే వాళ్లకు ఆ షూ పింక్, వైట్ కలర్‌లో కనిపిస్తుందట. లెఫ్ట్ బ్రెయిన్ డామినేట్ చేసేవాళ్లకు అది గ్రే, గ్రీన్ కలర్‌లో కనిపిస్తుందట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా.

ఆ పోస్ట్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేయగానే.. చాలామంది తమ కళ్లకు పరీక్ష పెట్టారు. తమకు ఏ కలర్‌లో కనిపించిందో కామెంట్ల ద్వారా తెలిపారు. కొందరు పింక్, వైట్ అని.. మరి కొందరు గ్రే, గ్రీన్ కలర్‌లో కనిపించిందని కామెంట్లు చేశారు. అయితే.. కొంతమంది ఈ ఆప్టికల్ ఇల్యూజన్ షూపై నెగెటివ్‌గా స్పందించారు. లెఫ్ట్ బ్రెయిన్ లేదు.. రైట్ బ్రెయిన్ లేదు.. ఆ షూ రకరకాల కలర్లతో మిక్స్ అయి ఉండటం వల్ల అలా కనిపిస్తుంది అంటూ విమర్శించారు. మరో వ్యక్తి అయితే ఏకంగా ఫోటోషాప్‌లో దాని కలర్ మార్చి కూడా చూపించాడు. సరే.. అవన్నీ వదిలేయండి. ఇంతకీ మీకు ఏ కలర్‌లో కనిపిస్తోంది ఆ షూ.
4163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles