కిడ్నీలో 3 వేల రాళ్లు

Thu,July 26, 2018 11:28 AM

China Woman Complained Of Back Pain Doctors Found Almost 3000 Kidney Stones

కిడ్నీలో 3 వేల రాళ్లు ఏంటని అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి! ఇది నిజం. చైనాకు చెందిన జాంగ్ అనే మహిళకు గత కొంతకాలం నుంచి వెన్ను నొప్పి(బ్యాక్ పెయిన్) తీవ్రంగా వస్తుంది. ఈ క్రమంలో జాంగ్.. వుజ్జిన్ ఆస్పత్రి డాక్టర్లను సంప్రదించింది. దీంతో ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె కుడి మూత్ర పిండం మొత్తం రాళ్లతో నిండినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక గంట పాటు వైద్యులు సర్జరీ చేసి.. జాంగ్ మూత్ర పిండంలో నుంచి 2,980 రాళ్లను బయటకు తీశారు. అయితే బాధిత మహిళకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలుసు. కానీ వేల సంఖ్యలో రాళ్లు ఉండటాన్ని చూసి ఆమె షాక్‌కు గురైంది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. గతంలో మహారాష్ట్రకు చెందిన ధన్‌రాజ్ వాడిలే కిడ్నీలో నుంచి 1,72,155 రాళ్లను బయటకు తీశారు.

7029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles