పాకిస్థాన్‌ క్రికెట్‌ ఫ్యాన్‌ ఫోటోపై అదిరిపోయిన ట్విట్టర్‌ మీమ్స్‌

Sat,June 15, 2019 05:24 PM

ఆయన పాకిస్థాన్‌కు చెందిన క్రికెట్‌ ఫ్యాన్‌. ప్రస్తుతం ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ నడుస్తోంది కదా. ఇటీవల పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరిగినప్పుడు స్టేడియంకు వెళ్లిన ఆ వ్యక్తి.. మ్యాచ్‌ చూస్తున్నాడు. మ్యాచ్‌ మధ్యలో పాకిస్థాన్‌ ప్లేయర్‌.. ఆస్ట్రేలియా ఆటగాడు కొట్టిన బంతిని క్యాచ్‌ పట్టకుండా మిస్‌ చేస్తాడు. దీంతో ఒక్కసారి లేచి దీనంగా చూస్తాడు ఆ వ్యక్తి. అంతే.. ఆ వ్యక్తిని క్యాప్చర్‌ చేసిన ఐసీసీ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. అంతే.. అప్పటి నుంచి అతడిని నెటిజన్లు తెగ ఆడుకుంటున్నారు.


రేపు ఫాదర్స్‌ డే కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని అతడికి దేశీ డాడ్‌ అంటూ పేరు పెట్టి.. ట్విట్టర్‌లో రకరకాల మీమ్స్‌తో మనోడికి ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు నెటిజన్లు. ఆ ట్వీట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మీరు కూడా ఆ మీమ్స్‌ను చూసి కాసేపు నవ్వుకోండి.















3294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles