మాల్దీవులకు ఆర్మీని పంపొద్దు.. ఇండియాకు చైనా సూచన!

Wed,February 7, 2018 03:19 PM

Do not send Army to Maldives China to India

బీజింగ్‌ః మాల్దీవుల సంక్షోభంలో జోక్యం చేసుకోవద్దని, మిలిటరీని పంపించొద్దని ఇండియాకు సూచించింది చైనా. ఇలా చేయడం వల్ల అక్కడి సంక్షోభం మరింత ముదురుతుందే తప్ప పరిష్కారం కాదని చైనా అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు జడ్జీలతోపాటు మాజీ అధ్యక్షుడినీ జైల్లో వేసి అరాచకంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు యమీన్‌కు చెక్ పెట్టడానికి మీ ఆర్మీని పంపండంటూ మంగళవారం ఆ దేశా ప్రతిపక్ష నేత మహ్మద్ నషీద్ కోరిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ చైనా విదేశాంగ ప్రతినిధి గెంగ్ షువాంగ్ స్పందించారు. మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూనే సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ సమాజం ప్రయత్నించాలి. అంతే తప్ప ప్రస్తుత పరిస్థితిని సంక్లిష్టం చేసే చర్యలు తీసుకోవద్దు అని షువాంగ్ అన్నారు.

సుప్రీంకోర్టు జడ్జీలు, మాజీ అధ్యక్షుడు గయూమ్‌లను జైల్లో వేసిన పరిస్థితుల్లో సమస్య ఎలా పరిష్కారమవుతుందని ప్రశ్నించగా.. సంబంధిత వర్గాలే అంతర్గతంగా ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని షువాంగ్ చెప్పారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది. మాల్దీవుల్లో సుస్థిరత వాళ్ల చేతుల్లోను ఉంది. వాళ్ల ఆ పని చేయగల సమర్థులని భావిస్తున్నాం అని షువాంగ్ తెలిపారు. మాల్దీవుల్లో చైనా ప్రాజెక్టులకు యమీన్ అనుమతి ఇవ్వడం వల్ల ఆ దేశం ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై గెంగ్ షువాంగ్ స్పందించలేదు. అయితే మాల్దీవులతో చైనా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని చెప్పారు.

3086
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles