జపాన్‌ జూలో డజన్ల కొద్ది తాబేళ్లు మాయం

Thu,November 7, 2019 06:16 PM


టోక్యో: జపాన్‌ జూలో తాబేళ్లు కనిపించకుండా పోయాయి. అంతరించిపోయే దశలో ఉన్న సుమారు 60 తాబేళ్లు కనిపించడం లేదని ఒకినావా జూ, మ్యూజియం ప్రతినిధి కొజ్యూ ఒజిమి తెలిపారు. తాబేళ్ల ఎన్‌క్లోజర్‌ మీదుగా నిర్దేశించిన ప్రాంతాలపై నుంచి వేయబడి ఉన్న ఓ తీగను తొలగించామని, గుర్తు తెలియని వ్యక్తులు తాబేళ్లను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మేందుకు అక్రమంగా తరలించినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. రుక్యు లీఫ్‌ తాబేళ్లు, ఎల్లో మార్జిన్డ్‌ బాక్స్‌ తాబేళ్లు వాణిజ్యపరంగా అత్యధిక ధర పలుకుతాయన్నారు. ఈ రెండు జాతులు అంతరించిపోయే దశలో ఉండటంతో..వాటి రవాణాపై నిషేధం అమలులో ఉందని ఒజిమి వెల్లడించారు.

2123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles