బుర్కాల‌పై శ్రీలంక‌లో నిషేధం

Mon,April 29, 2019 03:28 PM

హైద‌రాబాద్‌: బుర్కాల‌పై శ్రీలంక ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం నేటి నుంచి అమ‌లులోకి రానున్న‌ది. శ్రీలంక‌లో రెండు వారాల క్రితం ఈస్ట‌ర్ వేళ జ‌రిగిన వ‌రుస పేలుళ్ల‌లో సుమారు 250 మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో బుర్కా ధ‌రించిన వ్య‌క్తులు దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు అనుమానం వ్య‌క్తం చేశాయి. దీంతో దేశాధ్య‌క్షుడు సిరిసేన భ‌ద్ర‌త‌కు సంబంధించి కొత్త చ‌ట్టాన్ని త‌యారు చేశారు. ముస్లిం మ‌హిళ‌లు ధ‌రించే బుర్కా లేదా నికాబ్ లాంటి వాటిని బ్యాన్ చేస్తున్న‌ట్లు చెప్పారు. బుర్కాలే కాదు, ముఖాన్ని క‌ప్పే ఎటువంటి వ‌స్త్రాన్ని ధ‌రించి ఎవ‌రూ ప‌బ్లిక్‌గా తిర‌గ‌రాదు. పేలుళ్ల నేప‌థ్యంలో ఈ చ‌ట్టాన్ని అత్య‌వ‌స‌రంగా అమ‌లు చేస్తున్న‌ట్లు సిరిసేన చెప్పారు. పేలుళ్లు జ‌రిగి 8 రోజులు అవుతున్నా.. శ్రీలంక‌లో ఇంకా హై అల‌ర్ట్ కొన‌సాగుతున్న‌ది.
మ‌రోవైపు డిప్యూటీ ఇన్స్‌పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ చంద‌నా విక్ర‌మ‌ర‌త్నేను తాత్కాలిక పోలీసు చీఫ్‌గా నియ‌మించారు. కానీ పోలీస్ చీఫ్ పూజిత్ జ‌య‌సుంద‌ర మాత్రం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేద‌న్నారు. ప్ర‌భుత్వ వ‌ర్గాలు కూడా రాజీనామాను వెల్ల‌డించ‌లేదు. దాడుల‌కు సంబంధించి ముందుగా ఇంటెలిజెన్స్ పోలీసులు స‌మాచారం ఇచ్చినా.. పోలీస్ చీప్ పూజిత్ స‌రిగా స్పందించ‌లేద‌ని అధ్య‌క్షుడు సిరిసేన సీరియ‌స్‌గా ఉన్నారు. దేశాధ్య‌క్షుడి ఆదేశాల‌ను పూజిత్ వ్య‌తిరేకించిన‌ట్లు ఓ అధికారి వెల్ల‌డించారు.

2192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles