ఐఎస్‌ఎస్‌కు అనుసంధానంకాని తొలి మానవరూప రోబో

Sun,August 25, 2019 05:28 AM

Failed to connect capsule with humanoid robot on board to ISS

మాస్కో: అంతరిక్ష ప్రయోగంలో రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ తొలి మానవరూప(హ్యూమనాయిడ్) రోబోతో కూడిన అంతరిక్షనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేం ద్రం(ఐఎస్‌ఎస్)తో అనుసంధానం కాలేకపోయింది. దీంతో రష్యా నిపుణులు చేపట్టిన ఈ అనుసంధాన ప్రక్రియను నిలిపివేశారని, మానవరహిత సూయజ్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఐఎస్‌ఎస్ నుంచి దూరంగా మళ్లించారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. కాగా దీని వల్ల ఐఎస్‌ఎస్‌కు ఎలాంటి ముప్పు లేదని రష్యా నిపుణులు వెల్లడించారు. తమ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఎలాంటి సమస్య లేదని, అంతరిక్ష కేంద్రంలోని రేడియో పరికరంలో లోపాన్ని గుర్తించినట్లు తెలిపారు. దాన్ని సరిచేసి సోమవారం మరోసారి అనుసంధాన ప్రక్రియ చేపడతామన్నారు. గురువారం రష్యాలోని బైకనూర్ ప్రయోగవేదిక నుంచి మానవరహిత సూయజ్ ఎంఎస్ 14 అంతరిక్షనౌకను ప్రయోగించారు. ఐఎస్‌ఎస్‌లో తేలికపాటి విధులు నిర్వహించేందుకు తొలి మానవరూప రోబో ఫేడర్‌ను ఇందులో పంపారు.

1129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles