పర్సు పోయింది..ఖాతాలో డబ్బు జమ అయింది

Wed,October 16, 2019 03:02 PM

లండన్ చెందిన టిమ్ కామెరూన్ సోమవారం తన పని ముగించుకుని సైకిల్‌పై ఇంటికి తిరుగుపయనమయ్యాడు. అయితే టిమ్ కామెరూన్ వచ్చే దారిలో తన జేబులో ఉన్న పర్సు పోగొట్టుకున్నాడు. పర్సులో తన వివరాలను తెలుసుకునేందుకు ఎలాంటి ఐడీ కార్డు గానీ..ఇతర పత్రాలు కాని లేకపోవడంతో అది దాదాపు పోయినట్టేననుకున్నాడు టిమ్ కామెరూన్. పర్సు దొరకలేదు కానీ అతని డబ్బులు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. అదేంటీ అనుకుంటున్నారా..?. పర్సు దొరికిన వ్యక్తి టిమ్ ఖాతాలో డబ్బులు జమచేశాడు.


పర్సు పోగొట్టుకున్న టిమ్ కామెరూన్ ఆ తర్వాత తన ఖాతాలో ఏమైనా డబ్బులున్నాయేమోనని తన బ్యాంకు ఖాతాను చెక్ చేసుకున్నాడు. టిమ్ కామెరూన్ ఖాతాలో 4సార్లు నగదు జమ అయినట్లు చూపించింది. నగదు లావాదేవీల్లో..హాయ్ నేను రోడ్డుపై మీ పర్సు చూశాను. ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకుని నగదు పంపించానని సిమన్ బైపోర్డ్ అనే వ్యక్తి మెసేజ్ పంపాడు. టిమ్ కామెరూన్ లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

టిమ్ కామెరూన్ వెళ్లిన మార్గంలోనే సిమన్ బెఫోర్డ్ వెళ్లడంతో అతని పర్సు సురక్షితంగా ఉంది. అందులో ఉన్న మొత్తాన్ని టిమ్ కామెరూన్ ఖాతాకు సిమన్ బైఫోర్డ్ ట్రాన్స్‌ఫర్ చేశాడు. సిమన్ బైపోర్డ్ గొప్ప మనసు తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని, అతను గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి అని టిమ్ కామెరూన్ ప్రశంసలతో ముంచెత్తాడు. సిమన్ బైపోర్డ్ చేసిన ట్వీట్‌కు 30వేలకు పైగా రీట్వీట్స్ వచ్చాయి. వేల కామెంట్లతో వైరల్‌గా మారింది.



8416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles