ఎయిర్‌పోర్ట్‌ను చుట్టుముట్టిన ఆందోళ‌న‌కారులు.. వంద‌లాది ఫ్ల‌యిట్లు ర‌ద్దు

Mon,August 12, 2019 04:09 PM

Hong Kong Airport cancels all flights today as protesters enter main terminal

హైద‌రాబాద్: హాంగ్‌కాంగ్‌ మ‌ళ్లీ ఆందోళ‌న‌క‌రంగా మారింది. నిర‌స‌న‌కారులు వ‌రుస‌గా నాలుగువ రోజు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. హాంగ్‌కాంగ్ విమానాశ్ర‌య ట‌ర్మిన‌ల్‌లో ఆందోళ‌న‌కారుల ప్ర‌ద‌ర్శ‌న‌తో ప‌లు విమానాల‌ను ర‌ద్దు చేశారు. ప్ర‌పంచంలో అత్యంత బిజీ విమానాశ్ర‌యాల్లో హాంగ్‌కాంగ్ ఒక‌టి. దీంతో వేలాది మంది ప్ర‌యాణికులు ఇబ్బందిప‌డుతున్నారు. చాలా తీవ్ర స్థాయిలో విమాన రాక‌పోక‌లు దెబ్బ‌తిన్న‌ట్లు అధికారులు చెప్పారు. ఆందోళ‌న‌కారుల‌పై పోలీసులు ఆదివారం టియ‌ర్ గ్యాస్‌ను ప్ర‌యోగించారు. దీంతో అక్క‌డున్న నిర‌స‌న‌కారులు ఇవాళ ఎయిర్‌పోర్ట్‌ను పూర్తిగా స్తంభింప‌చేశారు. సుమారు వంద ఫ్ల‌యిట్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. ఇటీవ‌ల నేర‌స్థుల అప్ప‌గింత బిల్లును హాంగ్‌కాంగ్‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. దాన్ని వ్య‌తిరేకిస్తూ స్థానికులు నిర‌స‌న చేప‌ట్టారు. హాంగ్‌కాంగ్‌పై చైనా అజ‌మాయిషీని ఆందోళ‌న‌కారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. నిర‌స‌న‌కారులు ఉగ్ర‌వాదుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తాజాగా చైనా అధికారులు ఆరోప‌ణ‌లు చేశారు.

2142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles