రైడ్‌కు వస్తే చనిపోయినట్లు నటిస్తోన్న గుర్రం..వీడియో

Tue,October 22, 2019 07:05 PM

కొన్ని కొన్ని సార్లు చేసే పనిపై విరక్తి కలిగితే ఎలా ఉంటుంది. తప్పించుకోవడానికి ఏదో మార్గం వెతుకుతుంటారు. ఓ గుర్రం సరిగ్గా ఇలాంటి పద్దతే ఫాలో అయింది. జింగాంగ్ అనే గుర్రానికి రైడింగ్ చేయడంపై విసుగొచ్చినట్లుంది. జింగాంగ్ తనతో రైడ్ చేసేందుకు ఎవరు వచ్చినా హఠాత్తుగా కింద పడి చనిపోయినట్లు చేస్తుంది. కేవలం గుర్రం చనిపోయినట్లు నటిస్తుంది అంతే.


క్రిట్టర్ క్లబ్ ఫేస్‌బుక్‌లో పేజీలో ఫ్రాసిస్కో జలాసర్ అనే ఆటగాడు ఈ వీడియోను షేర్ చేశాడు. తన దగ్గరకు ఎవరైనా వ్యక్తి వచ్చిన ప్రతీసారి జింగాంగ్ కింద పడి నాలుక కరుచుకుని చనిపోయినట్లుగా నటిస్తోంది. జింగాంగ్ నటన ఆస్కార్ అవార్డు గెలుచుకునే స్థాయిలో ఉందని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. జింగాంగ్ చనిపోయినట్లుగా ఆటాడుతోంది. అందువల్ల దానిని ఎవరూ రైడ్ చేయలేకపోతున్నారని ఫ్రాసిస్కో జలాసర్ కామెంట్ పోస్ట్ చేశారు. జలాసర్ పోస్ట్ చేసిన వీడియోకు 2 వారాల్లోనే 23 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. గుర్రం నాలుక కరుచుకుంది. కండ్లు తేలేసింది. నమ్మశక్యంగా లేదు అంటూ ఓ నెటిజన్ నవ్వుల్లో మునిగిపోయాడు. ఈ గుర్రం నా మొత్తం జీవితాన్ని ప్రతిబింబిస్తోంది అని మరో నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు.

6516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles