దొంగ‌త‌నం చేశాడ‌ని.. మెడ‌లో పామును వేసి..

Mon,February 11, 2019 05:49 PM

జ‌క‌ర్తా : ఇండోనేషియాలో పోలీసులు ఓ దొంగ‌ను చిత్ర‌హింస పెట్టారు. ఆ దొంగ‌ మెడ‌లో రెండు మీట‌ర్ల పామును వేసి.. అత‌ని నుంచి నిజం క‌క్కించే ప్ర‌య‌త్నం చేశారు. పోలీసులు క‌థ‌నం ప్ర‌కారం.. ఓ దొంగ మొబైళ్ల‌ను దొంగ‌లించాడు. అత‌న్ని ప‌ట్టుకున్న పోలీసులు.. వాస్త‌వాలు బ‌య‌ట‌కు ర‌ప్పించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నం చేశారు. ఈ నేప‌థ్యంలో అత‌న్ని భ‌య‌ప‌ట్టించేందుకు అత‌ని మెడ‌లో పామును వేశారు. విచార‌ణ కోసం పామును వాడ‌డంతో.. ఆ వీడియో వైర‌ల్ అయ్యింది. దీంతో మాన‌వ హ‌క్కుల సంఘాలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. అయితే ఆ ఘ‌ట‌న ప‌ట్ల ఇండోనేషియా పోలీసులు క్ష‌మాప‌ణ చెప్పారు. దొంగ మెడ‌లో వేసిన పాము విష‌పూరిత‌మైంది కాదు అని పోలీసులు చెబుతున్నారు.5405
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles