డేంజ‌ర‌స్ స్టంట్ చేసిన జంట‌.. ఫైర‌యిన నెటిజ‌న్లు.. వైరల్ ఫోటో

Fri,April 12, 2019 03:18 PM

Instagram Couple Slammed For Dangerous pose From Edge Of swimming Pool

ఇది నా జీవితం. నాకు నచ్చినట్టుగా నేను ఉంటా. నాకు ఈ సమాజంతో సంబంధం లేదు. ఈ చిన్న జీవితాన్ని కూడా నాకు నచ్చినట్టుగా అనుభవించకూడదా? ఈ పాడు లోకం ఎప్పుడూ నామీదే పడి ఏడుస్తుంది. ఎవరి పని వారు చూసుకోవచ్చుగా. ఎప్పుడూ మా మీద ఏడ్వడం ఎందుకు? ఇదిగో ప్రతి మనిషి ఇలాగే ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే మనుషుల మనసులు వేరు కావచ్చు కానీ.. అందరి ఆలోచనలూ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకయ్యా అంటే.. ఓ జంట తమకు నచ్చిన పోజులో ఫోటోకు పోజిచ్చారు. ఆ ఫోటోను కాజువల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. అంతే.. ఉవ్వెత్తున లేచే కెరటంలా నెటిజన్లు విరుచుకుపడ్డారు ఆ జంట మీద‌. మీకేం పోయేకాలం. లైఫ్ రిస్క్ చేసి మరీ.. అలా ఫోటోకు పోజివ్వాల్సిన అవసరం ఏంది.. అంటూ ఆ జంటపై మండిపడుతున్నారు. ఇంతకీ ఆ జంట ఏ పోజులో ఫోటోకు పోజిచ్చారంటారా? మీరు పైన చూస్తున్నారుగా ఫోటో. అదే పోజు.

బాలిలోని ఓ స్విమ్మింగ్ ఫూల్‌లో ఇలా వెరైటీగా కెల్లీ, కొడీ అనే జంట లిప్ లాక్ చేస్తూ డేంజరస్ స్టంట్ చేశారు. వాళ్లు అమెరికన్ జంట. అయితే.. ఇందులో వాళ్లు చేసిన స్టంట్ ఏమీ లేదు. ఎందుకంటే.. అది ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్. అంటే.. ఆ స్విమ్మింగ్ పూల్‌కు జాయింట్‌గా మరికొన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఏదైనా నదికి గానీ, సముద్రానికి గానీ ఆ స్మిమ్మింగ్ పూల్ కనెక్ట్ అయి ఉంటుంది. నీళ్ల ప్రవాహం కూడా ఉంటుంది. వాళ్లు స్విమ్మింగ్ చేస్తున్న పూల్ కింద మరో పూల్ ఉంది. అందువల్ల ఒకవేళ అదుపు తప్పి ఆ యువతి కింద పడినా కింద మరో పూల్ ఉండటంతో ఏం కాదు.. అన్న ధైర్యంతోనే వాళ్లు ఈ సాహసానికి ఒడికట్టారట. అందుకే.. నెటిజన్ల ట్రోలింగ్‌ను తట్టుకోలేక వెంటనే మేం సేఫే.. మాకు మాగురించి తెలుసు.. మీ పని మీరు చూసుకోండి అంటూ.. ఆ పూల్ పూర్తి ఫోటో పెట్టి నెటిజన్లకు భలే కౌంటర్ ఇచ్చారు.

View this post on Instagram

🇺🇸 Our greatest strength in life, our most important principle, is discernment. Only you can know your body, feel the space around you and understand your capabilities. We would all do well to remember this, knowing that not every action, style or path we witness through others is or should be, replicated. At the end of the day we are to hold ourselves accountable for the decisions that we make. ※ 🇵🇦 La mejor fortaleza en la vida, el moral más importante, es discernimiento. Solo puedes entender tu cuerpo, sentir el espacio que te rodea y comprender tus capacidades. Haríamos bien en recorder este, sabiendo que no toda acción, estilo o camino que presenciamos por otros es o debe ser, replicado. Al final del dia, somos responsables de las decisiones que hacemos. ※ Thank you @kayonjungleresort for an unforgettable experience! ※ ※ #balitravel #couplesgoals #ilovetravel #bestplaces #baligasm #ubud #balitravel #novios #junglelife #viajeros #wetravel #travelinspo #adventurous #indonesiaparadise #speechlessplaces #infinitypool #welltraveled #earthpix #baliholiday

A post shared by Kelly + Kody ⚤🇺🇸 (@positravelty) on


View this post on Instagram

Seize the day with a beautiful view from our amazing pool. Thank you @la_la_la_lara for having a good time with us💕 #trulyubud ••••• Get special rate through our website with our promo code : TKJRIG18 thekayonjungleresort.com Resort for Adult Only ••••• The Kayon Jungle Resort Member of @pramanahotels  Managed by @pramanaexperience ••• #trulykayon #kayonubud #kayonresort #kepiturestaurant #pramanahotels #natureview #naturelover #wonderfulindonesia #bestdestinationwedding #honeymoon #romantichotel #explorebali #bali #visitbali #thebaliguideline #balidaily #baligasm #balilife #ubud #thebalibible #balibible #lovetotravel #traveltheworld #wonderfulhotel

A post shared by The Kayon Jungle Resort (@kayonjungleresort) on

4564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles