ఇంట్లో దూరిన దొంగలు.. ఇంటిని శుభ్రం చేసి వెళ్లిపోయారు.. వైరల్ స్టోరీ

Sat,May 25, 2019 01:19 PM

intruders broke into his house and cleaned bedroom and bathroom

దొంగలు ఇంట్లో దూరి ఏం చేస్తారు. ఇల్లును ఊడ్చేస్తారు కదా. అయితే.. మీరు చికెన్ బిర్యానీలో కాలేశారు. ఎందుకంటే.. అందరు దొంగలు ఒకేలా ఉండరు. అందరు దొంగలు ఇల్లును ఊడ్చేయరు. కొందరు ఇంటిని శుభ్రం చేసి కూడా వెళ్లిపోతారు. అవును.. నమ్మరా? నమ్మాల్సిందే. ఇటీవల కొందరు దొంగలు ఓ ఇంట్లో దూరి.. ఇంట్లో ఉన్న ఏ వస్తువునూ ముట్టుకోకుండా.. బాత్‌రూమ్స్, బెడ్‌రూమ్స్‌ను క్లీన్ చేసి.. వెళ్లిపోయారు. ఈ ఘటన యూఎస్‌లోని బోస్టన్‌లో చోటు చేసుకున్నది.

బోస్టన్‌కు చెందిన రోమన్ అనే వ్యక్తి.. ఆఫీసుకు వెళ్లే ముందు ఇంటి వెనుక ఉన్న డోర్‌ను వేయడం మరిచిపోయాడట. అతడు ఆఫీసుకు వెళ్లాక.. కొందరు దుండగులు అతడి ఇంట్లో దూరారు. అయితే.. ఇంట్లోని ఏ వస్తువునూ వాళ్లు ఎత్తుకెళ్లలేదు. ఇంటినంతా శుభ్రం చేశారు. బాత్‌రూమ్స్‌ను కూడా వదల్లేదు. వాటిని కూడా శుభ్రం చేశారు. బెడ్‌రూమ్‌లో బెడ్‌ను కూడా మంచిగా అరేంజ్ చేశారు. చివరకు టాయిలెట్ పేపర్‌తో రోజ్ ఆకారంలో డెకరేట్ చేసి వెళ్లిపోయారు.

ఆఫీసు అయిపోయిన తర్వాత ఇంటికొచ్చిన రోమన్.. ఇల్లును చూసి ఆశ్చర్యపోయాడు. తన ఇల్లు ఇంత క్లీన్‌గా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత చూస్తే.. ఇంటి వెనుక డోర్ తెరుచుకొని ఉంది. దీంతో ఎవరో వచ్చి ఇంటిని క్లీన్ చేశారని తెలుసుకున్నాడు. అయితే.. హౌస్‌కీపింగ్‌కు సంబంధించిన వ్యక్తులెవరైనా తప్పు అడ్రస్‌కు వచ్చి ఇలా తన ఇల్లు క్లీన్ చేశారేమో అని అనుకున్నాడట రోమన్. ఈ వింత ఘ‌ట‌న‌ను త‌న ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. దీంతో నెటిజ‌న్లు కూడా ఆ స్టోరీ చ‌దివి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఏది ఏమైతేనేం.. మనోడి ఇల్లును మాత్రం ఫ్రీగా క్లీన్ చేసి వెళ్లారు. అప్పుడప్పుడు బ్యాక్ డోర్ ఓపెన్‌లో పెట్టడం వల్ల ఇటువంటి లాభాలు కూడా జరుగుతాయా?

8306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles