శ్రీలంక‌లో ఉగ్ర‌దాడి మా ప‌నే..!

Tue,April 23, 2019 04:41 PM

Islamic state claims responsibility for SriLanka bombings

కొలంబో: శ్రీలంకలో వ‌రుస బాంబు పేలుళ్ల‌తో మార‌ణ‌హోమం సృష్టించింది తామేన‌ని ఉగ్ర‌దాడి జ‌రిగిన రెండు రోజుల త‌ర్వాత ఇస్లామిక్ స్టేట్ తాజాగా ప్ర‌క‌టించింది. అమాఖ్‌ న్యూస్‌ ఏజెన్సీ ద్వారా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ మంగ‌ళ‌వారం ప్రకటన విడుదల చేసింది. వ‌రుస బాంబు పేలుళ్ల దాడిలో మృతుల సంఖ్య 321కి పెరిగింది. మొత్తం 500 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతి చెందిన వారిలో 10 మంది భార‌తీయులు ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాడుల వెన‌క నేష‌న‌ల్ తౌహీద్ జ‌మాత్‌(ఎన్టీజే) ఉగ్ర‌వాద సంస్థ హ‌స్తం ఉన్న‌ట్లు శ్రీలంక ప్ర‌భుత్వం భావించింది.



5206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles