వీడిన మిస్ట‌రీ.. ఆత్మ‌హ‌త్యే అని తేల్చిన వైద్యులు

Sat,August 17, 2019 11:50 AM

న్యూయార్క్‌: అమెరికాలోని మ‌న్‌హ‌ట‌న్ జైలులో ప్ర‌ఖ్యాత ఫైనాన్స‌ర్ జెఫ్‌రీ ఎప్‌స్టీన్ మృతిచెందిన విష‌యం తెలిసిందే. అయితే అత‌ని మృతిపై వ్య‌క్త‌మైన అనుమానాల‌కు డాక్ట‌ర్లు చెక్ పెట్టారు. జైలు సెల్‌లో అత‌ను ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు న్యూయార్క్ డాక్ట‌ర్లు తేల్చారు. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న 66 ఏళ్ల ఎప్‌స్టీన్ గ‌త శ‌నివారం జైలు గ‌దిలో అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందాడు. అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా లేక ఎవ‌రైనా హ‌త్య చేయించారా అన్న సందేహాలు వ్య‌క్తం అయ్యాయి. అమెరికాలో మేటి ఫైనాన్స‌ర్‌గా ఎప్‌స్టీన్‌కు గుర్తింపు ఉంది. అత‌నికి ఆ దేశ మేటి రాజ‌కీయ‌వేత్త‌లు, వ్యాపార‌వేత్త‌ల‌తో సంబంధాలు ఉన్నాయి. అత‌ని ఫ్రెండ్స్ లిస్టులో బిల్ క్లింట‌న్‌, డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అయితే ఆ సంబంధాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌న్న ఉద్దేశంతోనూ ఎప్‌స్టీన్‌ను హ‌త్య చేసి ఉంటార‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. వంద‌లాది డాల‌ర్లను ఎర చూపి ఎప్‌స్టీన్ అనేక మంది అమ్మాయిల‌ను అనుభ‌వించాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ జైలు బోనులో ఎప్‌స్టీన్ మృతి చెంద‌డం ఓ మిస్ట‌రీగా మారింది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిట‌న్ క‌రెక్ష‌న‌ల్ సెంట‌ర్‌లో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త, నిఘా ఉంటుంది. అలాంటి జైలులో ఎప్‌స్టీన్ ఎలా మృతిచెందాడ‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. జైలులో అవ‌క‌త‌వ‌క‌లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఇటీవ‌ల గుర్తించారు. ఆ జైలులోనే హై ప్రొఫైల్ నేర‌స్తులు ఉన్నారు. మెక్సికో డ్ర‌గ్ డాన్ ఎల్ చాపో, పాంజీ స్కీమ్ మోస‌గాడు బెర్నీ మాడాఫ్ కూడా ప్ర‌స్తుతం ఆ జైలులోనే ఉన్నారు.

1754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles