ఆత్మ‌హ‌త్య‌కు 2 రోజుల ముందే.. 4000 కోట్ల వీలునామా రాశాడు

Tue,August 20, 2019 11:58 AM

Jeffrey Epstein signed will two days before his death

న్యూయార్క్‌: అమెరికాలోని మ‌న్‌హ‌ట‌న్ జైలులో కొన్ని రోజుల క్రితం ఫైనాన్స‌ర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే అత‌ను ఉరివేసుకోవ‌డానికి రెండు రోజుల ముందే వీలునామా రాసిన‌ట్లు తెలుస్తోంది. న్యూయార్క్ పోస్టు ప‌త్రిక దీనికి సంబంధించిన క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఆగ‌స్టు 8వ తేదీన వీలునామా రాశాడు. దాదాపు 577 మిలియ‌న్ల డాల‌ర్లు.. అంటే సుమారు రూ.4000 కోట్ల ఆస్తిని ఓ ట్ర‌స్టుకు రాసి ఇచ్చిన‌ట్లు తెలిసింది. మైన‌ర్ అమ్మాయిల‌ను లైంగికంగా వేధించిన కేసులో ఎప్‌స్టీన్ జైలు శిక్ష ప‌డింది. గ‌త జూలై నుంచి అత‌ను జైలులో ఉంటున్నాడు. అయితే ఎప్‌స్టీన్ నుంచి నష్ట‌ప‌రిహారం కోరేందుకు కోర్టులో పోరాడ‌నున్న‌ట్లు బాధితులు పేర్కొంటున్నారు.

6249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles