నేలపాలైన లక్ష గుడ్లు.. వీడియో

Wed,April 25, 2018 06:34 PM

ఇంట్లో అనుకోకుండా ఒక్క గుడ్డు పగిలిపోతేనే ఎంతో బాధ పడతాం. కాని.. ఈస్ట్ చైనాలోని క్వజ్‌హౌవ్ సిటీలోని హైవేపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్ష గుడ్లు పగిలిపోయాయి. దీంతో ఆ హైవే అంతా గుడ్లమయం అయిపోయింది. రోడ్డు మీద దాదాపు 12 మీటర్ల మేర గుడ్ల సొన పారింది. దీంతో దాన్ని క్లీన్ చేయడానికి సిబ్బంది రెండు గంటల సమయం తీసుకున్నారు. అసలు విషయం ఏంటంటే..


బాతు గుడ్లను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రక్కులో ఉన్న లక్ష గుడ్లు పగిలిపోయాయి. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. అయితే.. ఈ ప్రమాదం వల్ల కనీసం 85 వేల యువాన్‌ల నష్టం వాటిల్లిందట. అంటే మన కరెన్సీలో 8 లక్షల రూపాయలు అన్నమాట. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఇదివరకు జర్మనీలో ఇలాగే బీర్లతో వెళ్తున్న ఓ ట్రక్కు కారును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో దాదాపు 1500 దాకా బీరు బాటిళ్లన్నీ రోడ్డు మీద పడిపోయాయి.

7330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles