360 డిగ్రీ ఇన్ఫినిటీ స్విమ్మింగ్‌ పూల్‌.. 55 అంతస్తుల మీద.. ఎక్కడో తెలుసా?

Fri,June 7, 2019 05:57 PM

London To Get World First 360 Degree Infinity Pool

స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగితే చాలు.. అందులోనే ఈత కొడుతూ ఉండాలనిపిస్తుంది. ఎంత సేపు అయినా బయటికి రావాలనిపించదు. ఇక ఈ స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగితే జీవితమంతా అందులోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే.. అది ఉన్నది భూమ్మీద కాదు.. ఆకాశంలో అవును.. 55 అంతస్తుల మీద. మామూలు స్విమ్మింగ్‌ పూల్‌ కూడా కాదు అది. 360 డిగ్రీల ఇన్ఫినిటీ స్విమ్మింగ్‌ పూల్‌ అది. మీరు పైన చూస్తున్నారు కదా అదే ఫోటో. ఇంతకీ ఆ పూల్‌ ఎక్కడుంది చెప్పండి అని అంటారా? ఆ పూల్‌ ఇంకా నిర్మాణం కాలేదు కానీ.. దానికి సంబంధించిన డిజైన్‌ మాత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. అది త్వరలో లండన్‌లో నిర్మితం కానుంది. 6 లక్షల లీటర్ల నీటితో దాన్ని నిర్మించనున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌ అంతా పారదర్శకంగా ఉంటుంది. అందులో ఈత కొట్టే వాళ్లు తాము ఆకాశంలో ఈత కొడుతున్నామా? అన్న అనుభూతి కలిగించేలా ఆ స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణం జరగనుంది.

అయితే.. ఈ స్విమ్మింగ్‌ పూల్‌లోకి ఎలా వెళ్లాలి అనేది పెద్ద కన్ఫ్యూజన్‌. ఎందుకంటే అది 55 ఫ్లోర్ల బిల్డింగ్‌ మీద ఉంటుంది కాబట్టి.. దాని లోపలికి ఎంట్రీ అనేది ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఎందుకంటే.. బయటినుంచి మెట్లు కట్టి పూల్‌ అందాన్ని చెడగొట్టకూడదని ఇంజినీర్లు ఏం చేశారంటే.. పూల్‌ మధ్యలో కింది నుంచి స్పైరల్‌ ఆకారంలో మెట్లు ఉంటాయి. పూల్‌ అందం చెడిపోకుండా.. వాటిని కింది నుంచి నిర్మించనున్నారన్నమాట. ఈ పూల్‌ను లండన్‌కు చెందిన కంపాస్‌ పూల్స్‌ అనే కంపెనీ నిర్మించబోతున్నది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే మొట్టమొదటి 360 డిగ్రీ ఇన్ఫినిటీ పూల్‌ ఉన్న సిటీగా లండన్‌ చరిత్రకెక్కనుంది.

3624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles