మాల్దీవులు మాజీ అధ్యక్షుడి బ్యాంకు ఖాతాలు సీజ్

Sun,December 16, 2018 07:20 PM

Maldives former president abdul yameen accounts seized

కొలంబో: మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అవినీతి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు అబ్దుల్లా యమీన్ కు చెందిన 6.5 మిలియన్ డాలర్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు మాల్దీవులు పోలీసులు వెల్లడించారు. సెప్టెంబర్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అబ్దుల్ యమీన్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. రీఎలక్షన్ సమయంలో అబ్దుల్ యమీన్ వ్యక్తిగత ఖాతాకు సంబంధించి రెండు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఆ దేశ మానిటరీ అథారిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది.

1721
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles