పూర్తిగా చైనా చేతుల్లోకి మాల్దీవ్స్.. ఇండియా వినతికి నో!

Tue,February 27, 2018 04:32 PM

Maldives said no to Indias invitation to participate in Milan 2018

న్యూఢిల్లీః ఇండియా చుట్టుపక్కన ఉన్న దేశాలను మచ్చిక చేసుకుంటున్న చైనా.. ఇప్పుడు మరో దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లే కనిపిస్తున్నది. తాజాగా మాల్దీవ్స్ ఇండియాకు హ్యాండిచ్చింది. 16 దేశాలు పాల్గొనే నేవల్ కసరత్తుల్లో పాల్గొనడానికి మాల్దీవులను ఇండియా ఆహ్వానించినా.. ఆ దేశం నిరాకరించింది. దానికి కారణమేంటన్నది మాత్రం చెప్పలేదు. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ కింద చైనా నుంచి మాల్దీవులు భారీగా సాయం అందుకుంటున్నది. అందులో భాగంగానే ఇండియా వినతిని ఆ దేశం తోసిపుచ్చిందని భావిస్తున్నారు. మిలన్ పేరుతో ప్రతి రెండేళ్లకోసారి ఇండియా ఈ నేవల్ కసరత్తులను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇండో, పసిఫిక్ ప్రాంత దేశాలను ఇందులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానాలు పంపిస్తుంది.

ఈసారి దీనికి 16 దేశాలు ఓకే చెప్పాయి. హిందూ మహాసముద్రంలో ఉండే మాల్దీవులు మాత్రం నో చెప్పింది. అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో మలక్కా జలసంధిలో ఈ నేవీ కసరత్తులు జరుగుతాయి. ఈసారి మార్చి 6 నుంచి 13 వరకు ఎనిమిది రోజుల పాటు ఇవి జరగనున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ పూర్తిగా చైనా అనుకూలుడిగా ఉన్న విషయం తెలిసిందే. మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు కోరినా.. చైనా మాత్రం అలా చేయకూడదని ఇండియాను వారించింది. యమీన్ విధించిన ఎమర్జెన్సీని ఇండియా వ్యతిరేకించడంతో ఆయన పూర్తిగా చైనా పక్షాన నిలిచాడు. ఈ మధ్యే బెల్డ్ అండ్ రోడ్ ప్రాజెక్ట్‌లో చేరుతున్నట్లు యమీన్ సంతకాలు కూడా చేశారు.

3386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles