సింక్ పగిలిపోయిందా? టెన్షన్ పడకండి.. నూడుల్స్‌తో రిపేర్ చేయొచ్చు.. వీడియో

Fri,May 17, 2019 02:55 PM

Man fixes broken sink with noodles video goes viral

మీకు టూమినట్స్ నూడుల్స్ తెలుసు కదా. అవి దేనికి ఉపయోగపడతాయి. ఇన్‌స్టంట్‌గా స్నాక్స్‌లా వండుకొని తినడానికి ఉపయోగపడతాయి అంటారు.. అంతే కదా. కానీ.. నూడుల్స్‌ను కేవలం తినడానికి మాత్రమే కాదు.. వేరే విధంగానూ వాడుకోవచ్చు. ఉదాహరణకు మీ ఇంట్లో ఉన్న సింక్(వాష్ బేషిన్) పగిలిపోయిందనుకోండి. ఏం చేస్తారు. ప్లంబర్‌ను తీసుకొచ్చి రిపేర్ చేయిస్తారు అంతే కదా. కానీ.. ప్లంబర్ అవసరం లేకుండానే పగిలిన సింకును కొత్త సింక్‌లా తయారు చేయొచ్చు. నూడుల్స్‌తో అది సాధ్యం. నమ్మరా.. మీరు నమ్మరని మాకు తెలుసు అందుకే ప్రూఫ్ కూడా తీసుకొచ్చాం. మీకోసమే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

ఆ వీడియో చూసిన తర్వాత మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. మీరే కాదు.. చాలామంది నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. తమకు తోచిన విధంగా కామెంట్లు చేయడం, సెటైరికల్ వీడియోలు కూడా పెట్టడం చేయడంతో.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.6942
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles