ఇంటి కింద 45 పాములు.. వీడియో

Thu,March 21, 2019 01:00 PM

Man found 45 Rattlesnakes under his house in Texas

హూస్టన్: ఒక్క పామును చూస్తేనే మన ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. అలాంటిది పదుల సంఖ్యలో పాములు ఒక్కచోట ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అల్బానీలో ఉండే ఓ ఇంటి యజమానికి ఇదే అనుభవం ఎదురైంది. తన ఇంటి కింద ఓ కేబుల్ కోసం వెతికిన అతనికి పదుల సంఖ్యలో రాటిల్ స్నేక్స్ కనిపించాయి. వాటిని చూసి ఆందోళన చెందిన అతడు వెంటనే బిగ్ కంట్రీ స్నేక్ రిమూవల్‌కు ఫోన్ చేశాడు. వాళ్లు వచ్చి చూస్తే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 రాటిల్ స్నేక్స్ అక్కడ కనిపించాయి. వాటిని ఒక్కొక్కొటిగా బయటకు తీసి.. చివరికి అన్నింటినీ సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆ సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. ఇప్పటికే 11 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. రాటిల్ స్నేక్ ఎంతో ప్రమాదకరమైన పాము జాతి. గతంలో ఇదే టెక్సాస్ రాష్ట్రంలో మరో వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన షెడ్‌లో అతను ఏకంగా 30 రాటెల్ స్నేక్స్ కనిపించాయి.

7169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles