కొండ పైనుంచి ఫ్రిడ్జ్‌ పడవేత.. అదే వ్యక్తి చేత తెప్పించిన పోలీసులు.. వీడియో

Tue,August 6, 2019 07:07 PM

Man Throws Fridge Off Cliff, Cops Make Him Drag It Back

కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో? ఓ వ్యక్తి కొండ అంచు పైనుంచి రిసైక్లింగ్ నిమిత్తం ఓ ఫ్రిడ్జ్‌ను లోయలోకి విసిరేశాడు. ఫ్రిడ్జ్‌ను రిసైక్లిల్ చేస్తున్నాం.. ఇది ఎన్ని ముక్కలు అవుతుందో చూద్దాం అంటూ కొండపై నుంచి విసిరేశాడు. ఇదంతా అతని సహచరుడు వీడియో తీశాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం పోలీసుల దాకా వెళ్లింది. వీడియో ఆధారంగా పోలీసులు సదరు వ్యక్తిని గుర్తించి ఫ్రిడ్జ్ పడేసిన ప్రదేశానికి తీసుకువెళ్లారు. సరిగ్గా నిర్వీర్యం చేసే నిమిత్తం లోయలో పడ్డ ఫ్రిడ్జ్‌ను అదే వ్యక్తి చేత పోలీసులు తిరిగి తెప్పించారు. ఈ విషయాన్నంతా పోలీసులు వీడియో తీసి షేర్ చేశారు. అతడి నిర్లక్ష్యానికి ఎంత జరిమానా విధించాలో న్యాయస్థానం నిర్ణయిస్తుందని తెలిపారు. ఇంతకు చెప్పనేలేదు కదూ. ఇదంతా జరిగింది స్పెయిన్‌లోని అల్మెరియా ప్రాంతంలో.

5020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles