ఇండియాలో అడుగుపెట్టిన మంగోలియా అధ్యక్షుడు

Thu,September 19, 2019 05:17 PM

న్యూఢిల్లీ: మంగోలియా అధ్యక్షుడు ఖాల్ట్‌మాగ్గిన్‌ బట్టూల్గా ఇండియాలో పర్యటించనున్నారు. ఆయన ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టారు. ఆయనకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయన భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సమావేశమవుతారు. భారత్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన పరిశీలించనున్నారు. రేపు ఆయన భారత ప్రధాని మోదీతో కలిసి మంగోలియాలోని గండన్‌ మొనాస్టరీలో బుద్ద విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరించనున్నారు.



743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles