మంత్రముగ్ధుల్ని చేస్తున్న హిల్ కౌంటీ ఫార్మింగ్ వీడియో

Wed,November 6, 2019 10:13 AM

హైదరాబాద్: న్యూజిలాండ్‌లోని హిల్ కౌంటీ ఫార్మింగ్ వీడియో చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. రంగిటికే జిల్లా కౌన్సిల్‌లోని హిల్ కౌంటీ ఫార్మింగ్‌లో డ్రోన్‌తో చిత్రీకరించిన గొర్రెల మంద కదలిక విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక్కసారిగా వెయ్యి గొర్రెలు ఒక ఫాం నుండి మరో ఫాంకు తోలబడుతున్నాయి. పశ్చిక మైదానాల్లో తిరుగుతున్న వీటి సంచారాన్ని కాపరుల కుక్కలు అదుపుచేస్తున్నాయి. సముద్ర ప్రవాహ కెరటాల నురగల్లా, గాలి పవనాల స్వేచ్ఛా విహారంల సంచరిస్తున్న గొర్రెల కదలికలను కెమెరాలో బంధించారు. అందమైన ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటుంది.

1707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles