మీ కళ్లను మీరే నమ్మలేరు.. ఆ సర్కిల్స్ ఏ కలర్స్‌లో ఉన్నాయో చెప్పండి..!

Fri,July 12, 2019 05:13 PM

Mind blowing Optical Illusion Is Viral

ఆప్టికల్ ఇల్యూజన్.. దాన్నే భ్రాంతి అని కూడా పిలుస్తారు. అంటే ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా అన్నమాట. సోషల్ మీడియాలో చాలా ఆప్టికల్ ఇల్యూజన్స్ వైరల్ అవుతుంటాయి. తాజాగా మరో ఆప్టికల్ ఇల్యూజన్ వైరల్‌గా మారింది. మీరు పైన చూస్తున్నారు కదా ఫోటో. దాన్ని చూడగానే మీకు 12 సర్కిల్స్ కనిపించాయా? ఆ సర్కిల్స్ కలర్స్ ఏంటో చెప్పాలి మీరు. వాటి మధ్యలో నుంచి కొన్ని రంగుల గీతలు పోతున్నాయి కదా. రకరకాల రంగులు ఆ సర్కిల్స్ మీది నుంచి వెళ్తున్నప్పుడు రకరకాల కలర్లలో ఆ సర్కిల్స్ మీకు కనిపిస్తాయి. కాదు.. కనిపించినట్టు అనిపిస్తుంది. కానీ.. అవన్నీ ఒకే కలర్‌లో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. అందుకే దాన్ని ఆప్టికల్ ఇల్యూజన్ అని అంటారు.

దీన్ని డేవిడ్ నోవిక్ అనే కంప్యూటర్ ఇంజినీర్ రూపొందించాడు. ఆ సర్కిల్స్ ఎందుకు అలా కనిపిస్తున్నాయి.. వాటి వెనుక మర్మమేంటో తర్వాత వీడియోతో సహా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. నెటిజన్లు కూడా ముందు అవి ఏ కలర్లలో ఉన్నాయో చెప్పలేక నెత్తిగోక్కున్నారు. ఇంతకీ మీకు అవి ఏ కలర్లలో కనిపిస్తున్నాయి..


3164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles