కాసేపట్లో మోదీ, ట్రంప్ ప్రసంగం..

Sun,September 22, 2019 07:43 PM

హోస్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇవాళ హోస్టన్ నగరంలో జరిగే హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరై, ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. హోస్టన్‌లోని ఎన్‌ఆర్జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు భారీగా తరలి వస్తున్నారు. వీరిరువురూ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రసంగించనున్నారని వినికిడి.


ఇటీవల ఇండియా జమ్మూ కశ్మీర్‌కు ఉన్న పత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. ఈ సమస్య భారత అంతర్గత వ్యవహారమని ఆయన తెలిపిన విషయం తెలిసిందే. కాగా, ఈ కార్యక్రమంలో వీరిరువురూ ఏ అంశాలపై ప్రసంగిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు.

499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles