ఇంట్లోకి చొరబడ్డ మౌంటెయిన్ లయన్..వీడియో

Thu,September 19, 2019 05:40 PM


కాలిఫోర్నియా: టుయోలుమ్నే కౌంటీలోని ఓ ఇంట్లోకి అనుకోని అతిథి వచ్చింది. సొనొరలో ఉన్న ఇంట్లోని బాతురూంలోకి ఆదివారం రాత్రి మౌంటెయిన్ లయన్ (పర్వత సింహం)చొరబడ్డది. ఇంటి యజమాని లయన్‌ను చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. భయంతో పారిపోవాలనుకున్నాడు. అయితే సింహం మాత్రం స్తానికులకు ఎలాంటి భయాందోళన కలిగించకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ తర్వాత యజమాని మెల్లగా బాత్‌రూం దగ్గరకు వెళ్లి సింహం ఉన్న తలుపు గడియపెట్టాడు. అనంతరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అధికారులకు సమాచారమందించాడు.


అధికారులు రెండో అంతస్థులో ఉన్న బాత్‌రూం కిటికీ పగులగొట్టి ఓ నిచ్చెన ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లో సింహం ఆ నిచ్చెన పై నుంచి బయటకు దూకి పరుగులు పెట్టింది. యజమాని అనుమతితో కిటికీ అద్దాలు పగులగొట్టి సింహానికి ఎలాంటి హాని కలిగించకుండా బయటకు పంపించినట్లు అధికారులు తెలిపారు. సింహం కిటికీలో నుంచి బయటకు దూకి పారిపోయిన వీడియోను కాలిఫోర్నియా పోలీసులు ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి.


4708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles