మయన్మార్‌లో 34కు చేరిన మృతుల సంఖ్య

Sat,August 10, 2019 10:11 PM

Myanmar landslide kills 34 scores missing

మావ్లామైన్ : మయన్మార్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 34కు చేరింది. కొన్ని రోజులుగా తూర్పు మయన్మార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన్ రాష్ట్రంలోని యే ప్యార్ కోన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సుమారు 16 ఇండ్లు నేలమట్టమై బురదలో కూరుకుపోయాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం నాటికి 34 మృత దేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 47 మంది గాయపడగా 80 మంది అదృశ్యమైనట్లు వెల్లడించారు. కాగా ప్రమాదం నుంచి బయటపడిన కొందరు తమ వారి ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్నారు.

1189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles