వ‌ణికిన అంగారకుడు..

Thu,April 25, 2019 03:52 PM

NASA records first likely quake tremors on Mars

హైద‌రాబాద్‌: అంగారక గ్ర‌హంపై ప్ర‌కంప‌న‌లు న‌మోద‌య్యాయి. భూకంపం త‌ర‌హాలోనే అరుణ గ్ర‌హం వ‌ణికిన‌ట్లు నాసా శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. నాసాకు చెందిన ఇన్‌సైట్ మార్స్ ల్యాండ‌ర్ ఆ ప్ర‌కంప‌న‌ల‌ను న‌మోదు చేసింది. ఏప్రిల్ 6వ తేదీన ఈ ప్ర‌కంప‌న‌లు రికార్డు అయ్యాయి. అంగారక గ్ర‌హ భాగం లోతుల్లోంచి ఆ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు ఓ అంచ‌నాకు వ‌చ్చారు. అయితే ఇన్‌సైట్ ల్యాండ‌ర్ పంపిన సిగ్న‌ల్‌ను శాస్త్ర‌వేత్త‌లు ఇంకా అధ్య‌య‌నం చేస్తున్నారు. గ్ర‌హం కంపించడం వ‌ల్లే శ‌బ్ధాలు వ‌స్తున్న‌ట్లు అనుమానిస్తున్నారు. అయితే ఇంకా డేటాను పూర్తిగా విశ్లేషించాల్సి ఉంద‌ని నాసా చెప్పింది. అంగారక గ్ర‌హంపై వ‌స్తున్న శ‌బ్ధాల‌కు చెందిన రికార్డును కూడా విడుద‌ల చేశారు. ఆ శ‌బ్దాల‌ను బ‌ట్టి అంగారక గ్ర‌హంపై సెసిమిక్ యాక్టివిటీ జ‌రుగుతున్న‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు.

1785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles