కేరళ వర్షాలపై నాసా శాటిలైట్ వీడియో

Wed,August 22, 2018 06:05 PM

NASA releases video of intense rainfall in Kerala

హూస్టన్: గత వారం ఇండియాలో కురిసిన భారీ వర్షాల తాలూకు శాటిలైట్ డేటాను ఉపయోగించి నాసా ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో ఆధారంగా కేరళలో కురిసిన భారీ వర్షాలపై ఓ అంచనా వచ్చింది. ఎడతెరపి లేని వానల వల్ల కేరళతోపాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ వరదలు వచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా ఈ సమయంలో దేశంలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. దీనికితోడు అల్పపీడనాల వల్ల మరిన్ని భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ అయితే గత వందేళ్లలో ఎన్నడూ చూడని వర్షాల బారిన పడింది. మొత్తం 231 మంది ఈ వరదల్లో మృత్యువాత పడగా.. కొన్ని లక్షల మంది ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఆగస్ట్ 13 నుంచి 20 వరకు ఇండియాలో భారీ వర్షాలు కురిసినట్లు నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా దేశంలోని పశ్చిమ ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసినట్లు నాసా తెలిపింది. నాసా శాటిలైట్ ప్రతి అరగంటకోసారి డేటాను పంపిస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్న వర్షపాతంపై శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చే వీలు కలుగుతుంది.

4418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles