నార్త్ కొరియాను ఏదో ఒక‌టి చేయాలి : ట‌్రంప్

Thu,July 6, 2017 02:51 PM

North Korea behaving in a very very dangerous manner, says Donald Trump

వార్సా: పోలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవ‌ల ఖండాంత‌ర క్షిప‌ణి ప్ర‌యోగించిన నార్త్ కొరియాపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నార్త్ కొరియా చాలా ప్ర‌మాద‌క‌రంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని, వాళ్ల ప్ర‌వ‌ర్త‌న సిగ్గు చేటుగా ఉంద‌ని, దాన్ని అడ్డుకునేందుకు ఏదో ఒక‌టి చేయాల‌ని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. పోలాండ్ అధ్య‌క్షుడు ఆండ్రెజే డుడాతో క‌లిసి ప్ర‌త్యేక మీడియా స‌మావేశంలో పాల్గొన్న ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. నార్త్ కొరియాపై సైనిక చ‌ర్య‌కు దిగుతారా అన్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ కొన్ని క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని ట్రంప్ అన్నారు.

1314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles