అమెరికాను త‌ప్పుప‌ట్టిన కిమ్‌

Fri,April 26, 2019 10:53 AM

North Korea leader Kim accuses US of bad faith

హైద‌రాబాద్‌: అమెరికా వైఖ‌రిని ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ త‌ప్పుపట్టారు. అగ్ర‌రాజ్యం అమెరికా త‌మ ప‌ట్ల త‌ప్పుడు విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించింద‌న్నారు. ఇటీవ‌ల వియ‌త్నాంలో ట్రంప్‌తో జ‌రిగిన స‌మావేశాన్ని ఉద్దేశిస్తూ కిమ్ ఆ వ్యాఖ్య‌లు చేశారు. ర‌ష్యా ప‌ర్య‌ట‌నకు వెళ్లిన కిమ్‌.. అక్క‌డ పుతిన్‌తో క‌లిసిన త‌ర్వాత అమెరికా తీరుపై త‌న అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. అణు నిరాయుధీక‌ర‌ణ విష‌యంలో అమెరికా విధానం స‌రిగా లేద‌న్నారు. అమెరికా తీసుకునే నిర్ణ‌యాల ఆధారంగానే కొరియా ద్వీపంలో శాంతి నెల‌కొంటుంద‌ని కిమ్ అన్నారు. వ్లాదివోస్తోక్‌లో పుతిన్‌తో భేటీ త‌ర్వాత కిమ్ ఈ కామెంట్స్ చేశారు. కొరియా ద్వీపంలో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని పుతిన్‌కు కిమ్ చెప్పారు. శాంతి చ‌ర్చ‌ల‌ను అమెరికానే బ్రేక్ చేసిన‌ట్లు ఉత్త‌ర కొరియా ఆరోపిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో కిమ్ కామెంట్స్ మ‌రింత ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. మ‌రోవైపు ఉత్త‌ర కొరియా వెళ్లేందుకు పుతిన్ అంగీక‌రించిన‌ట్లు తెలుస్తున్న‌ది.

1349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles