ఆ బ్యాక్టీరియా సోకితే అంతే..

Fri,July 7, 2017 04:48 PM

Oral sex spreading dangerous gonorrhoea bacteria

జెనీవా: గ‌నేరియా వ్యాధి ప్ర‌మాద‌క‌రంగా విస్త‌రిస్తున్న‌ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. నోటితో మ‌ర్మాంగాల‌ను(ఓర‌ల్ సెక్స్‌) స్ప‌ర్శిస్తూ శృంగారం చేయ‌డం వ‌ల్ల గ‌నేరియా బ్యాక్టీరియా సోకుతుంది. అయితే ప్ర‌స్తుతం గ‌నేరియా విస్త‌రిస్తున్న తీరు ఆ వ్యాధిని అరిక‌ట్ట‌డం క‌ష్టంగానే మారింద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొన్న‌ది. కొన్ని కేసుల్లో అయితే ట్రీట్‌మెంట్ అస‌లు వీలుకావ‌డం లేద‌ని ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. కండోమ్స్ వాడ‌కం త‌గ్గడం వ‌ల్ల కూడా ప‌రిస్థితి మ‌రింత విష‌మంగా మారుతున్న‌ద‌ని ఆరోగ్యం సంస్థ తెలిపింది. విశృంఖ‌ల శృంగారం వ‌ల్ల సంక్ర‌మిస్తున్న వ్యాధుల‌ను అడ్డుకునే యాంటీబ‌యాటిక్స్ కూడా అంత‌గా ప‌నిచేయ‌డం లేద‌ని ఆ సంస్థ పేర్కొన్న‌ది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న డ్ర‌గ్స్ కూడా గ‌నేరియా చికిత్స‌కు స‌రిపోవ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది. ఒక‌వేళ ఆ బ్యాక్టీరియాకు స‌రైన స‌మ‌యంలో చికిత్స చేయ‌కుంటే దాని వ‌ల్ల నపుంస‌క‌త్వం కూడా వ‌చ్చే అవ‌కాశాలున్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో నివేదిక స్ప‌ష్టం చేసింది. మొత్తం 77 దేశాల్లో నిర్వ‌హించిన స‌ర్వే ఆధారంగా ఆరోగ్య సంస్థ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. జ‌పాన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్ దేశాల్లో కొన్ని కేసుల‌కు అస‌లు ట్రీట్‌మెంట్ కుద‌ర‌లేద‌ని కూడా డ‌బ్ల్యూహెచ్‌వో డేటా పేర్కొన్న‌ది. ఎన్ని ర‌కాల యాంటీబ‌యాటిక్స్ వాడినా, గ‌నేరియా బ్యాక్టీరియా వాటికి రెసిస్టెంట్‌గా మారుతుంద‌ని నివేదిక తెలిపింది. గొంతుకు సోకుతున్న గ‌నేరియా బ్యాక్టీరియాను నిర్మూలించ‌డం క‌ష్టంగా మారుతోంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. మ‌హమ్మారిలా వ్యాపిస్తున్న ఆ బ్యాక్టీరియాపై దృష్టి పెట్టాల‌ని, వాటిని నిర్మూలించేందుకు కావాల్సిన ఔష‌ధాల త‌యారీకి ప్ర‌పంచ దేశాల‌కు ముందుకు రావాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వీ పిలుపునిచ్చింది.

1628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles