డైనోసర్ గుడ్లు బయటపడ్డాయ్!

Wed,December 27, 2017 07:33 PM

డైనోసర్‌ను సినిమాల్లో చూడటమే కాని మనం నిజంగా చూసింది లేదు. వాటి అవశేషాల ఆధారంగా అవి అలా ఉంటాయ్.. ఇలా ఉంటాయ్ అంటూ చెప్పుకోవడమే కాని డైనోసర్ల జాతిపై ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. అయితే.. రీసెంట్‌గా వాటి గుడ్లు మాత్రం బయట పడ్డాయి. ఎక్కడో తెలుసా.. చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో. దాయు కంట్రీలోని ఓ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో మొత్తం 20 డైనోసర్ గుడ్లు బయటపడ్డాయి. ఆ సైట్‌లో ఉన్న బండరాళ్లను తొలగిస్తుంటే ఇవి బయటికి వచ్చాయట. ఇవి 130 మిలియన్ సంవత్సరాల కిందివి అయి ఉండొచ్చని పురావస్తు శాఖ అంచనా వేసింది. అంటే.. 13 కోట్ల సంవత్సరాల క్రితం గుడ్లు అన్నమాట. ద్యావుడా...

4261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles