క‌ర్తార్‌పూర్ వీడియోలో ఖ‌లిస్తానీ వేర్పాటువాదులు

Wed,November 6, 2019 03:06 PM

హైద‌రాబాద్‌: సిక్కులను ఆహ్వానిస్తూ క‌ర్తాపూర్ కారిడార్‌పై పాకిస్థాన్ ప్ర‌భుత్వం ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఆ పాట‌లో ఖ‌లిస్తానీ వేర్పాటువాద నేత‌లు క‌నిపించే దృశ్యాలు ఉన్నాయి. పాక్ స‌మాచార శాఖ రిలీజ్ చేసిన ఆ వీడియోపై అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఖ‌లిస్తానీ వేర్పాటు నేత‌లు జ‌ర్నేల్ సింగ్ భింద్ర‌న్‌వాలే, మేజ‌ర్ జ‌న‌ర‌ల్ షాబేగ్ సింగ్‌, అమ్రిక్ సింగ్ ఖ‌ల్సాలు.. పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఓ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తారు. వాస్త‌వానికి ఈ వేర్పాటువాదులు 1984లో గోల్డెన్ టెంపుల్ వ‌ద్ద జ‌రిగిన ఆప‌రేష‌న్ బ్లూస్టార్‌లో చ‌నిపోయారు. ఆల‌యంలోకి చొర‌ప‌డ్డ ఉగ్ర‌వాదుల‌ను త‌రిమేందుకు అప్ప‌ట్లో ఇండియ‌న్ ఆర్మీ.. బ్లూస్టార్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. మ‌రోవైపు అమృత్‌స‌ర్‌లో న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ, ఇమ్రాన్ ఖాన్ పోస్టర్లు ద‌ర్శ‌న‌మివ్వ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. పాక్‌లోని క‌ర్తార్‌పూర్ గురుద్వారాతో లింక్‌ను ఏర్ప‌ర్చ‌డంలో ఇద్ద‌రూ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఆ పోస్ట‌ర్ల‌పై రాశారు.911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles