లైవ్ ఛానల్‌ డిబేట్ లో కిందపడ్డాడు..వీడియో

Thu,September 19, 2019 04:58 PM

పాకిస్థాన్ జీటీవీ న్యూస్ ఛానల్‌లో కశ్మీర్ అంశంపై ప్రత్యక్షప్రసారంలో చర్చా కార్యక్రమం నడుస్తోంది. లైవ్‌లో చర్చ కొనసాగుతుండగా డిబేట్ ప్యానెల్‌లో ఉన్న సీనియర్ విశ్లేషకుడు హఠాత్తుగా కుర్చీపై నుంచి కిందపడిపోయాడు. చర్చ నడుస్తోండగా మజహర్ బర్లాస్ అనే విశ్లేషకుడి కుర్చీ అదుపుతప్పడంతో ఆయన కిందపడ్డాడు. అయితే ఇంత జరిగుతున్నా న్యూస్ యాంకర్ మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. సదరు న్యూస్ యాంకర్ నాలుక కరుచుకుంటూ చిత్రమైన భావాలు వ్యక్తీకరించాడు.


న్యూస్ యాంకర్ తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. లైవ్ షోలో ఓ సీనియర్ విశ్లేషకులు కుర్చీ విరిగి కింద పడితే ఇలా స్పందించకపోవడం సరైంది కాదు అని ఓ నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు. జూన్‌లో ఓ లైవ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ పాకిస్థానీ నేత జర్నలిస్టుపై దాడి చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.


4082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles