ఐస్‌తో పాండాల ఆటలు.. ఫన్నీ వీడియో

Wed,June 19, 2019 02:45 PM

పాండాలు తెలుసు కదా. అవి ఎక్కువగా వేడిని తట్టుకోలేవు. వాటికి ఎప్పుడూ చల్లదనం కావాలి. అయితే చైనాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక.. చెంగ్డూ రీసెర్చ్ బేస్‌లో పాండాల కోసం ఐస్ క్యూబ్‌లను ఏర్పాటు చేశారు. అక్కడ పాండాల బ్రీడింగ్ సెంటర్ ఉంది. అది పర్యాటక ప్రాంతం కూడా. అయితే.. అవి పెరుగుతున్న ఉష్ణోగ్రతను తట్టుకోలేకపోవడంతో అక్కడి ఉష్ణోగ్రతలను తగ్గించడం కోసం.. వాటికి చల్లదనం కల్పించడం కోసం ఐస్ క్యూబ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో అవి వాటితో సరదాగా ఆడుకున్నాయి. వాటిని పట్టుకొని అటూఇటూ తిరుగుతూ ఆడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

1557
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles